మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఏఐఎస్ఎఫ్ బృందం
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : మెను ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి బంగారు ప్రేమ్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని ముస్త్యాల,చేర్యాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మెను ప్రకారం విద్యార్థులకు అన్నం, గుడ్లు, తాజా కూరగాయాలు, ఆకుకూరలతో మధ్యాహ్నం భోజనం వండాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చేర్యాల మండల అధ్యక్షులు బైకని ప్రకాష్, మండల ఉపాధ్యక్షులు సుంచు సంజయ్, మండల నాయకులు వానరాసి నరేందర్, అజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.