మెప్మా ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ఖమ్మం (కార్పొరేషన్‌) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జాబ్‌మేళాను ఈరోజు నిర్వహించారు. ఎస్‌ఎస్‌డీసీ` మెప్మా సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను నగరపాలక కమిషనర్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు. జాబ్‌మేళాకు సుమారు 100కు పైగా యువతీ యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ వేణుమనోహర్‌, ఐబీ ఇన్‌ఛార్జ్‌ కమలశ్రీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.