మెమన్‌కు ఉరిశిక్ష అమలు

4

– భారీ బందోబస్తు మధ్య కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగింత

ముంబై,జూలై 30(జనంసాక్షి):

ముంబయి బాంబుపేలుళ్ల కేసులో నేరస్థుడైన యాకుబ్‌ మెమన్‌కు నాగ్‌పూర్‌ జైలులో గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. చివరిక్షణం  ఉత్కంఠగా మారిన యాకుబ్‌ మెమన్‌ ఉరి పక్రియ సజావుగా ముగిసింది. అర్థరాత్రి వరకు శిక్షరద్దుకు సుప్రీం గడపదొక్కిన మెమెన్‌కు చివరకు ఉరితప్పలేదు. 1993 ముంబై పేలుళ్ల దోషి మెమన్‌కు నాగపూర్‌ జైళ్లో ఉదయం 6.50 గంటలకు ఉరి అమలు జరిపినట్టు జైలు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఈ తెల్లవారుజామున ఒంటిగంటకు యాకుబ్‌ను నిద్రలేపిన అధికారులు లాంఛనాలను పూర్తి చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న, భార్య తదితరులను యాకుబ్‌ కలుసుకున్నారు. ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నాగ్‌పూర్‌ జైలులో యాకుబ్‌ మెమన్‌ను ఉరి తీశారు.యాకుబ్‌ మెమన్‌ ఉరి శిక్ష అమలు దృష్ట్యా ముంబయి, నాగ్‌పూర్‌లలో హైఎలర్ట్‌ ప్రకటించారు. నాగ్‌పూర్‌ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కేసును  విచారించిన సుప్రీంకోర్టు చివరి పిటీషన్‌ను కూడా కొట్టివేయడంతో ఇక యాకుబ్‌ ఉరి ఖరారైపోయింది. కాగా ముందు నుంచీ సిద్ధంగా ఉన్న నాగపూర్‌ కేంద్ర కారాగారం అధికారులు సుప్రీంకోర్టు తీర్పును పక్కాగా అమలు చేశారు. 1993, మార్చి 12న ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన దోషిగా నిర్దారణ అయిన యాకుబ్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు ఉరి తీసి ఉగ్రమూకలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం రాత్రి కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రపతితో సమావేశం అనంతరం యాకుబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో 14 రోజుల పాటు శిక్షను వాయిదా వేయాలని యాకుబ్‌ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పిటిషన్‌పై తెల్లవారుజామున సుమారు 90 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. యాకుబ్‌ తరపున ఆనంద్‌ గ్రోవర్‌ వాదన వినిపిస్తూ.. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన పత్రం యాకుబ్‌కు అందలేదని కోర్టును తెలియజేశారు. క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణను సవాలు చేసే హక్కు యాకుబ్‌ ఉందని.. అయినా ఇంత తక్కువ సమయంలో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఎలా తిరస్కరించారని ప్రశ్నించారు. పిటిషన్‌ తిరస్కరణ తర్వాత 14 రోజులు గడువు ఇవ్వాలని గ్రోవర్‌ వాదించారు. యాకుబ్‌ తరపు న్యాయవాది వాదనను అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ తోసిపుచ్చారు. యాకుబ్‌ పిటిషన్‌ న్యాయవ్యవస్థను కించపర్చేదిగా ఉందని… ఈ పిటిషన్‌ విచారనార్హం కాదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు యాకుబ్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఉదయం ముందు అనుకున్న మేరకు ఉరిశిక్షను అమలు చేశారు. ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్‌ మెమన్‌ ఒక్కరే ఇందులో ఉరిశిక్షకు గురికాగా నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉరితీశారు. అయితే గురువారమే యాకుబ్‌(53) పుట్టినరోజు కావడం గమనార్హం. బుధవారం అర్ధరాత్రి అతడి కుటుంబ సభ్యులు నాగ్‌పూర్‌ జైలు సూపరింటెండెంట్‌కు మెమన్‌ జన్మదిన కేకును అందించారు. ఉరిశిక్ష వాయిదా పడేలా యాకుబ్‌ చివరి వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఆ సమయంలో మెమన్‌ భార్య, కూతురు ముంబయిలోనే ఉండగా అతని సోదరుడు సులేమాన్‌, బంధువు ఉస్మాన్‌ నాగ్‌పూర్‌లోని ఓ ¬టల్‌లో ఉన్నారు.

ఇప్పటి వరకు 22మందికి ఉరి

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నాగ్‌పూర్‌ జైలులో యాకూబ్‌తో కలిపి ఇప్పటివరకు 22 మందిని ఉరి తీశారు. ఈ జైలులో 1950 సంవత్సరంలో మొదటిసారి ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేశారు. చివరగా 1973లో మరో దోషిని ఉరితీశారు. అనంతరం 42 సంవత్సరాల తర్వాత ఆ జైలులో యాకూబ్‌ మెమన్‌ని ఉరితీశారు. ఉరిశిక్ష అమలు ఖరారు కావడంతో నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో బుధవారం యాకూబ్‌ను ఆయన కుటుంబసభ్యులు కలిశారు. సోదరుడు సులేమాన్‌ని చూసి యాకూబ్‌ కళ్లు చెమ్మగిల్లాయని జైలు అధికారులు తెలిపారు. ‘నేను ఎదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి’ అంటూ యాకూబ్‌ తన తోటి ఖైదీలకు, జైలు అధికారులకు చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదని వైద్యులకు యాకుబ్‌ తెలిపినట్లు వారు చెప్పారుక్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించడంతో మెమెన్‌ కు అన్ని దారులు మూసుకుపోయాయి.. ఉరిశిక్ష తర్వాత ముంబై, నాగపూర్‌ లో భద్రత భారీగా పెంచారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ఎయిర్‌ పోర్టులు, రైల్వే,బస్సు స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని… అందువల్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని ¬ంశాఖ సూచించింది.

ఉరి శిక్షకు గురైన ఉగ్రవాది యాకూబ్‌ మెమెన్‌ మృత దేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మెమెన్‌ మృతదేహాన్ని ఫోటోలు తీయరాదని పోలీసులు విూడియాపై ఆంక్షలు పెట్టారు. యాకూబ్‌ ను ఉరి తీసిన తర్వాత ఆయన బౌతిక కాయాన్ని కుటుంబానికి ఇవ్వకపోవచ్చని వార్తలు వచ్చాయి. జైలు ప్రాంతంలోనే అంత్యక్రియలు చేయవచ్చని భావించారు.కాని ప్రభుత్వం మెమెన్‌ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. కాగా మెమన్‌ తన అంతిమ కోర్కెగా కుమార్తెను చూడాలని ఉందని చెప్పగా, అధికారులు అందుకు ప్రయత్నించారు. కాని అది వీలు పడదని భావించి, పోన్‌ ద్వారా జుబేదాతో మాట్లాడించారు. ఆ తర్వాత ఉరికంబానికి ఎక్కించారు. మెమెన్‌ శవాన్ని స్వాధీనం చేసుకున్న బంధువులు దానిని వారు ఉండే ముంబై తసీఉకుని వెళ్లారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  ఉదయం ఉరిశిక్ష అమలైన తరువాత నాగ్‌పూర్‌ జైలు నుంచి అంబులెన్స్‌లో యాకూబ్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లారు. నాగ్‌పూర్‌ జైల్లోనే పోస్టుమార్టం నిర్వహించారు. అయితే భౌతికకాయాన్ని ఎక్కడ ఖననం చేయాలన్నది తర్వాత నిర్ణయిస్తామని మహారాష్ట్ర ¬ంశాఖ తెలిపింది. అయితే, ముంబైలోనే ఏదో ఒక ప్రాంతంలో ఖననం చేస్తారని సమాచారం. యాకూబ్‌ మెమెన్‌ను ఉగ్రవాద కేసులో ఉరి తీసినందున అతని సమాధికి సంబంధించిన వివరాలు బయటకు తెలియజేయడం సరికాదని ¬ంశాఖ అభిప్రాయపడింది. మెమెన్‌ మృత దేహాన్ని నాగ్‌పూర్‌ జైల్‌ నుంచి అంబులెన్స్‌లో విమానాశ్రయం వరకు తీసుకువచ్చి ఇండిగో విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలించారు. మహిన్‌ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసానికి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని యాకూబ్‌ బంధువులు భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ఇదిలావుంటే మెమెన్‌ను ఉరి తీసిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. నాగ్‌పూర్‌, ముంబై, ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలే ఇందుకు ప్రధాన కారణం. ఉరి శిక్షకు ప్రతికారంగా ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చునని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీలో భద్రతను పెంచారు. ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ విధించారు. జైలు చుట్టుపక్కలకు ఎవరినీ రానీయలేదు. రద్దీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ముంబైలోనూ భద్రత పెంచారు. కీలక ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. చొరబాట్లు జరగకుండా భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. పంజాబ్‌లోనూ దాడులు జరిగే అవకాశం ఉందని ఆర్మీ ఇంటిలిజెన్స్‌ వెల్లడించింది.