మెరిశారు మురిపించారు

81482776811_625x300అంతర్జాతీయ క్రీడాంగణంలో ఈ ఏడాదీ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. రియో ఒలింపిక్స్‌ అందరి దృష్టిని ఆకర్షించగా… విశ్వక్రీడల వేదికపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ పలువురు స్టార్‌ క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. అభిమానులను మురిపించారు. కొత్త ప్రత్యర్థులు వచ్చినా… కొత్త తారలు తెరపైకి వచ్చినా తమ ఉనికిని చాటుకుంటూ వారందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అథ్లెటిక్స్‌లో ఉసేన్‌ బోల్ట్, స్విమ్మింగ్‌లో మైకేల్‌ ఫెల్ప్స్, టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్‌… ఇలా పేరున్న వారందరూ ఈ ఏడాదిలో తమ అద్భుత ఆటతీరుతో అలరించారు