మెరిసిన సూర్యకుమార్, కోల్‌కతా బోణీ: పస లేని ముంబై బౌలింగ్

1po1k6h2
కోల్‌కతా:డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపియల్ 8లో బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్‌పై బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచులో సునాయసంగా విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ మెరిశాడు. అతను సునాయసంగా సిక్స్‌లు బాదాడు. 18.3 ఓవర్లలో ముంబై ఇండియన్స్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 170 పరుగులతో ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో ఐదు సిక్స్‌లు ఒక ఫోర్‌తో 46 పరుగులు చేసిన నాటౌట్‌గా మిగిలాడు. యూసుఫ్ పఠాన్ 12 బంతుల్లో 14 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. మందకొడిగా మొటలు పెట్టిన కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఆ తర్వాత వేగం పెంచి 43 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. గంభీర్ కొట్టిన బంతి హర్భజన్ చేతుల్లోకి వచ్చి జారిపోయింది. దాంతో బంతి బౌండరీ దాటింది. తద్వారా గంభీర్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది హర్బజన్ బౌలింగులోనే జరిగింది. ఆ తర్వాత బుమ్రాహ్ బౌలింగులో గంభీర్ అవుటయ్యాడు. దీంతో 121 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. అయితే, అప్పటికీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు విజయావకాశాలు తగ్గలేదు. మెరిసిన సూర్యకుమార్, కోల్‌కతా బోణీ: పస లేని ముంబై బౌలింగ్ చెలరేగి ఆడుతూ వచ్చిన మనీష్ పాండే చివరకు హర్భజన్ సింగ్‌కు దొరికిపోయాడు. 24 బంతుల్లో 40 పరుగులు చేసిన అతను హర్భజన్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హర్భజన్ సింగ్ బౌలింగులో మనీష్ పాండే గాలిలోకి బంతిని కొట్టాడు. అయితే అండర్సన్ గాలిలోకి ఎగిరి అందుకోబోయాడు. అయితే, జారిపడిపోయింది. దాంతో మనీష్ పాండేకు లైఫ్ దొరికింది. మనీష్ పాండే, గౌతం గంభీర్ చెలరేగి ఆడుతున్నారు. 32 బంతుల్లో 50 పరుగుల భాగస్యామ్యాన్ని నెలకొల్పారు. కోల్‌కతా నైట్ రైడర్స్ 13 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రాబిన్ ఉతప్ప కేవలం 9 పరుగులు చేసి అండర్సన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్ తన ముందు ఉంచిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ లసిత్ మలింగ వేసిన తొలి ఓవరులో 3 పరుగులు చేసింది. కాగా, తర్వాతి ఓవరు వినయ్ కుమార్ వేశాడు. వినయ్ కుమార్ వేసిన బంతికి గౌతం గంభీర్ విరిగి రెండు ముక్కలయింది. అదే ఓవరులో గౌతం గంభీర్‌కు లైఫ్ కూడా దొరికింది. వికెట్ కీపర్ బంతిని జారవిడిచాడు. కోల్‌కతాపై జరిగిన మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు పెంచి రెండు పరుగులతో సెంచరీ మిస్సయ్యాడు. 98 పరుగులు చేసిన నాటౌట్‌గా మిగిలాడు. అతను 68 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 12 ఫోర్లతో 98 పరుగులు చేశాడు. కోరే అండర్సన్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. చివరి బంతిని సిక్స్ కొట్టి ముంబై ఇండియన్స్ స్కోరును 168 పరుగులకు చేర్చాడు. దీంతో విజయానికి కోల్‌కతా నైట్ రైడర్స్ 169 పరుగులు చేయాల్సి ఉంటుంది. కోరే అండర్సన్ 41 బంతుల్లో మూడు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. 37 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మ, కోరే అండర్సన్ వికెట్ కోల్పోకుండా స్కోరును పెంచుకుంటూ వెళ్లారు. అంతకు ముందు, పది ఓవర్లకు ముంబై ఇండియన్స్ 57 పరుగులు మాత్రమే చేసింది. అప్పటికి మూడు వికెట్లు కోల్పోయింది. అటువంటి స్థితిలో చివరలో రోహిత్, అండర్సన్ దూకుడుగా ఆడి చివరి ఆరు ఓవర్లలో 88 పరుగులు చేసి స్కోరును పెంచారు. రోహిత్ శర్మ, అండర్సన్ కలిసి 88 బంతుల్లో 131 పరుగులు చేశారు. మెరిసిన సూర్యకుమార్, కోల్‌కతా బోణీ: పస లేని ముంబై బౌలింగ్ ఐపియల్ 8 పోటీల్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ట్వంటీ20 మ్యాచులో ముంబై ఇండియన్స్ వికెట్లు వరుసగా పడుతూ వచ్చాయి. అయితే రోహిత్, అండర్సన్ దానికి కళ్లెం వేశారు. 37 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.మోర్కెల్ బౌలింగులో అంబటి రాయుడు సున్నా పరుగులకే అవుటయ్యాడు. అంతకు ముందు తారే ఏడు పరుగులు మాత్రమే చేసి షకీబ్ ఆల్ హసన్ బౌలింగులో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. బుధవారంనాడు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) కెప్టెన్ గౌతం గంభీర్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, ఫించ్ బ్యాటింగ్‌కు దిగారు. ప్రారంభం మందకొడిగా సాగి, రెండో ఓవరులో ఫించ్ అవుటయ్యాడు. మోర్కెల్ బౌలింగులో అతను పెవిలియన్ దారి పట్టాడు. 8 పరుగులకే ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఐపియల్ 8లో 60 మ్యాచులో 47 రోజుల పాటు దేశవ్యాప్తంగా 12 మైదానాల్లో జరుగుతాయి. నిరుడు ఐపియల్ టైటిల్‌ను కెకెఆర్ గెలుచుకుంది. పైనల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించి రెండోసారి ట్రోఫీని దక్కించుకుంది. జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్: గౌతం గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, రియాన్ టెన్ దోస్చెటె, షకీబ్ ఆల్ హసన్, యూసుఫ్ పఠాన్, ఆండ్రే రసెల్, కుల్దీప్ యాదవ్, మోర్నె మోర్కెల్, పాట్రిక్ కమిన్స్, పియూష్ చావ్లా, సునీల్ నరైన్, జోహాన్ బోథా, అజర్ మహమూద్, ఉమేష్ యాదవ్, వీర్ ప్రతాప్ సింగ్, జేమ్స్ నీషం, బ్రాడ్ హాగ్, ఆదిత్య గర్వాల్, సుమిత్ నర్వాల్, కెసి కరియప్ప, వైభవ్ రావల్, షెల్డన్ జాక్సన్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, అంబటి రాయుడు, అభిమన్యు మిథున్, ఆదిత్య తారే, పార్ధివ్ పటేల్, కీరోన్ పోలార్డ్, కోరే ఆండర్సన్, లసిత్ మలింగ, హర్భజన్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రాహ్, జోష్ హాజిల్‌వుడ్, మర్చంట్ డే లాంగే, పవన్ సుయాల్, శ్రేయాస్ గోపాల్, లెండిల్ సిమన్స్, ప్రజ్ఞాన్ ఓజా, మిచెల్ మెక్‌క్లెంగ్‌హాన్, అయిడెన్ బ్లిజార్డ్, అక్షయ్ వాఖరే, నితీష్ రానా, సిధేష్ లాడ్, హార్దిక్ పాండ్యా, జగదీష సుచిచ్, ఉన్ముక్త్ చంద్, ఆర్ వినయ్ కుమార్