మేజిక్ షో ద్వారా ఉత్సాహం పొందిన విద్యార్థులు

మండల పరిధిలోని చండీ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోపాటుగా
ప్రాథమిక పాఠశాల చండి ప్రాంగణం లో
గురువారం
మేజిక్ షో నిర్వహించి ఇరు పాఠశాలలకు చెందిన విద్యార్థులను మ్యాజిక్ షో ద్వారా  నిర్వాహకులు ఉత్సాహ పరిచారు.
ప్రాథమిక పాఠశాల పోతారం లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కామేశ్వేర్ రావు ప్రవృత్తిగా మేజిక్ ప్రదర్శన లు ఇస్తూ వుంటాడు. ఇందులో భాగంగా గురువారం చండి పాఠశాలలో మేజిక్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని మేజిక్ ప్రదర్శన లో మెళుకువలు నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం లో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెహర్ బేగం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్ప, ఉపాద్యాయులు అరుణ, రోజ్ మేరీ, విజేందర్ రెడ్డి, సంతోష్ కుమార్, వామన శర్మ, హేమలత, నారాయణ్ రావు, జీవరత్నం లతోపాటుగా ఇరు పాఠశాలలు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.