మేడారానికి కొత్త వెలుగు
ప్లాస్టిక్ వాడకుండా కఠిన చర్యలు
కలెక్టర్ ఆదేశాలతో ప్లాస్టిక్‌పై మొదలైన యుద్దం
ములుగు,డిసెంబర్12(జనంసాక్షి): మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టింది. ప్రజలను, వ్యాపారులను, భక్తులను చైతన్యం చేస్తోంది. ఆసియా ఖండంలోనే అదిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా చేపట్టేందుకు జిల్లా స్థాయి అధికారులు సమర్థ వంతంగా పనిచేయాలని కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి సూచించారు. వచ్చే ఫిబ్రవరి 5,6,7,8 తేదీలలో జరిగే మేడారం జాతరను పర్యావరణానికి హాని కలుగకుండా, ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. జాతరకు హాజరయ్యే భక్తులు బట్ట సంచులను వెంట తెచ్చుకొని ఎ/-లాస్టిక్‌ను నిషేధించాలని ఆయన అన్నారు. ఎ/-లాస్టిక్ బ్యా గులకు బదులు ప్రతి ఒక్కరూ జూట్, బట్ట, పేపర్ బ్యాగులను వాడాలని అన్నారు. ¬టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, మటన్, చికెన్, కిరాణ, అన్ని వాణిజ్య సముదాయాలతోపాటు ప్రభుత్వకార్యాలయాల్లో సైతం ప్లాస్టిక్ కనిపించకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఎ/-లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను ఖచ్చితంగా వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమం తక్షణమే అమలుకావాలని, జనవరి 1వ తేదీ నుంచి ములుగు జిల్లాలో ప్లా స్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా చేపట్టే కార్యాచరణపై ఆయన ఇటీవల అధికారులలు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 1వ తేదీ నుంచి జిల్లాలో ఎక్కడా ప్లాస్టి క్ వాడటం, సరఫరా కావడం లాంటివి కనిపించరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు అధికారులు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ సేకరణకు 40కేంద్రాలను గుర్తించి స్కాప్ర్ సేకరణదారులకు ఎ/-లాస్టిక్‌ను అప్పగించనున్నట్లు తెలిపారు. జాతర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను ఎప్పటికప్పుడు సేకరించి ఒక ప్లాస్టిక్ ముక్క కూడా మేడారం భూమిలో మిగిలి పర్యావరణానికి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి జాతరకు హాజరయ్యే భక్తులు ప్లాస్టిక్‌ను వెంట తేకుండా జూట్, బట్ట కాగితం, సంచులను వెంట తెచ్చుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ విస్తరి ఆకులను కూడా వాడకుండా ఎ/-లాస్టిక్ ఫ్రీ మేడారం జాతరకు సహకరించాలని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడారం జాతర వనదేవత జాతర అని, ఈ జాతరలో ప్లా స్టిక్ వాడకంతో పర్యావరణానికి, వన్యప్రాణులకు నష్టం వాటిల్లకుండా పర్యావరణ హితమైన జాతర జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టిక్ నిషేధ ఉల్లంఘటనకు పాల్పడితే రూ.5వే లకు తగ్గకుండా జరిమానాలను విధించ నున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ఈ మేరకు జాతర ఏర్పాట్ల దగ్గర ఇప్పుడు ప్రచారం మొదలయ్యింది. ప్రధానంగా వ్యాపారులకు ముందే హెచ్చరికలుచేశారు.