మేనేజింగ్‌, సహకారసంఘాల కాలపరిమితి మరో 6నెలలు పొడిగింపు

జెఎన్‌. టి యు పరిధిలోకి సాంకేతిక విద్యతోపాటు పలు ఆర్డినెస్‌లకు ఆమోదం

డిసెంబర్‌1నుండి ఇందిరమ్మ అమృత హస్తం

క్యాబినెట్‌ ఆమోదం

హైదరాబాద్‌, నవంబర్‌28: సహకార సంఘాలు, మేనేజ్‌మిటింగ్‌ కమిటీల కాలపరిమితి మరో 6నెలలుపాటు పొడిగించడంతో పాటు పలు ఆర్డినెన్స్‌లకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగింది. 2012 అక్టోబర్‌ 25న ముగిసిన మేనేజింగ్‌ కాపరిమితిని ఆరు నెలలపాటు పొడిగిస్తూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే సహకారసంఘాల కాలపరిమితి మరో 6నెలల పొడిగించడంతో పాటు సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు జరుపాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ముసాయిదా డ్రాప్టు, మైనార్టీ కవిూషన్‌ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సాంకేతిక విద్యా మండలిలో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలను జెఎన్‌టియు పరిధిలోకి తెస్తూప అక్కటోబర్‌ 25న జారీ చేసిన ఆర్డినెన్స్‌ కు ఆమోదం తెలిపింది. అలాగే ఇంజనీరింగ్‌ సీట్ల పెంపు కొత్త కాలేజీల ఏర్పాటుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చేసిన సూచనలకు క్యాబినెట్‌ ఆమోదు తెలిపింది. దీని ద్వారా మహబూబ్‌పగర్‌ , మెదక్‌,, ఆదిలాబాద్‌ , శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొత్త కాలేజీల ఏర్పాటు ప్రోత్సాహం లభిస్తుంది. జనవరిలో ప్రారంభించాలనుకున్న ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని డిసెంబర్‌ 1నుండి ప్రాంరంభించిడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా పోషకాహారంలోపం వల్ల బాదపడుతున్న 19శాతం పిల్లలకు రక్త హీనతతో బాదపడుతున్న 62. 9శాతం పిల్లలకు చేయూత నివ్వడానికి వీలు కలుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు , పెన్షనర్లకు 5. 99 శాతం కరువు బత్యాన్ని పెంచుతూ జారీ చేసి ఉత్తర్వులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. పెంచిన కరువు బత్యాన్ని డిసెంబర్‌ 1నుండి చెల్లిస్తారు. 2012 జూలై నుండి అక్టోబర్‌ 2012 బకాయిలను ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమచేస్తారు. పెంచిన కరువు బత్యం వల్ల ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం పై 124 కోట్ల భారం పడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 42 మున్సిపాలిటీలు నగర పంచాయతీల కోసం 42 కవిూషనర్లు, 42 మున్సిపల్‌ అసిస్టెంట్లు

పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిసింది. పౌరసంబందాల వ్యవస్థ మరింత పటిష్టం కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్‌ విభాగం తో పాటు 7జిల్లాలో నిఘా విభాగాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆప్‌ నాలెడ్జ్‌ లో 306 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిసింది. అలాగే ఉద్యాన వన శాఖ పటిష్టతకు వివిధ విభాగాల్లో 192 పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.