మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం
హైదరాబాద్ : ఏప్రిల్ 25 నుంచి మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలే సాధారణ ఎన్నికలకు గీటురాయని అన్నారు. అవిశ్వాసంతో ఎవరేమిటో తేలిపోయిందని పేర్కొన్నారు.వివ్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై సభాపతికి ఫిర్యాదు చేస్తామని సీఎం తెలిపారు.