మైనారిటీలకు టీఆర్‌ఎస్ అండ: మహమూద్ ఆలీ

j4otgsjrమెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. అభ్యర్థుల తరపున టీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ సిద్దిపేటలో మైనారిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సభలో మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సలీం తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ ఆలీ మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధికి ఓటేసినట్టేనని స్పష్టం చేశారు. సిద్దిపేటలో హజ్ హౌజ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధనలో సిద్దిపేట ప్రజల కృషి మరవలేనిదని తెలిపారు. మైనారిటీలకు తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలోని ఐఏఎస్ క్వార్టర్లకు ధీటుగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తామన్నారు.