మైనారిటీ సోదరులు స్థానిక ఎమ్మెల్యే పై గరం గరం*

మద్దూర్ (జనంసాక్షి):నారాయణపేట జిల్లా  మద్దూరు మండల కేంద్రంలో మైనారిటీ సోదరులు మీడియా  సమావేశంలో మైనార్టీలకు ఏ ఒక్క హామీని అమలు చేయడం లో  స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వివక్ష  చూపిస్తున్నారని  మద్దూర్ మండల మైనార్టీ నాయకులు మండిపడ్డారు. మండల కేంద్రంలో జామియా మసీదులో స్థానిక మైనార్టీ నాయకుల మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కొడంగల్ ఎమ్మెల్యే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మైనార్టీ నాయకులు  మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.కొడంగల్ నియోజకవర్గానికి మూడు కోట్ల 50 లక్షలు అభివృద్ధి పనులకు మంజూరు పత్రాలు తీసుకువచ్చిన నియోజకవర్గంలో ఒక పని కూడా మొదలు కావడం లేదని అన్నారు.  మద్దూరు మండలానికి సంబంధించి ఉర్దూఘర్ కోసం 20లక్షలతో మంజూరు అయిన పనుల కోసం గత సంత్సరం మద్దూరు పాత బస్టండ్ సెంటల్లో 15 రోజులలో పనులు ప్రారంభిస్తానని చెప్పిన ఎమ్మెల్యే  సంవత్సరం  గడుస్తున్నా పనులు ఎందుకు ప్రారంభిస్తాలేరని ఎమ్మెల్యే పై మండిపడ్డారు. మద్దూరు మండలంలో నిరుపేదలకు అందవలసిన షాదీ  ముబారక్  చెక్కులు 20 నెలలు గడిచినా రావడం లేదని  మైనార్టీ సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు.  స్మశానవాటిక మరమ్మతు పనులు , మైనార్టీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఎన్ని సార్లు  ఎమ్మెల్యేకు  విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే  పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి మద్దూరు మండల మైనార్టీ సమస్యలు తీర్చాలని మైనార్టీ నాయకులు మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల మైనార్టీ సోదరులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.