మైనింగ్‌ మాఫియాకు, మతతత్వ పార్టీకి గుణపాఠం

హైదరాబాద్‌ : కర్ణాటకలో మైనింగ్‌ మాఫియాకు, మతతత్వ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించినట్లే ఇక్కడే కూడా తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోనియాగాంధీ నాయకత్వంలోనే రాష్ట్రంలోని కిరణ్‌ సర్కార్‌ పనిచేస్తోందని చెప్పారు. కిరణ్‌, చిరంజీవి వర్గాలని వాదనలు చేయడం సరికాదని అన్నారు.