మొక్కంపాడులో నూతన పంచాయతీ భవనానికి ప్రతిపాదన 

టేకులపల్లి, మార్చి 3( జనం సాక్షి ): మండలంలోని మొక్కంపాడు గ్రామపంచాయతి నూతన భవన కార్యాలయాన్ని నిర్మాణం చేయడానికి గ్రామ సర్పంచ్ బానోతు విజయ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకవర్గం సమావేశంలో ప్రతిపాదించి తీర్మానం చేశారు. పాలక వర్గ ఎజెండాలో ముఖ్యంగా జనాభా ప్రాతిపాదికన దాదాపుగా 40 సంవత్సరాల నుండి అనేక వసతులు ఉండి ప్రాచీనం పొందిన తండాగా మొక్కం పాడు తండా కి మంచిపేరు ఉంది. నూతనంగా గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాత గెలిచిన పాలకవర్గం ప్రజలందరి సహకారంతో అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.