మొక్కలు నాటకపోతే ఉద్యోగాలు ఊడతాయ్!
– రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
– విూ ఊరి భవిష్యత్ విూచేతుల్లోనే
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
– గట్లనర్సింగాపూర్‌లో 30రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించిన మంత్రి
వరంగల్, సెప్టెంబర్6 (జనం సాక్షి ) : గ్రామాల్లో మొక్కలు నాటకపోతే అధికారుల ఉద్యోగాలు ఊడతాయంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామాల సమగ్ర వికాసమే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విూ ఊరి భవిష్యత్ విూ చేతుల్లోనే ఉందని, చెత్త చెదారం లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం విూ బాధ్యత అని ఎర్రబెల్లి హితవుపలికారు. గ్రామాభివృద్ధికి దాతల సాయం కచ్చితంగా ఉండాలన్నారు. గట్లనర్సింగాపూర్ గ్రామాభివృద్ధి కోసం భాస్కర్‌రావు అనే దాత రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్ వర్క్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత తీసుకుంటా’ అని మంత్రి పేర్కొన్నారు. ప్లలెలో గుణాత్మక మార్చు తీసుకువచ్చే బృహత్తరమైన, అరుదైన అవకాశం ప్రస్తుత సర్పంచ్‌లకు దక్కిందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. విస్తృత స్థాయిలో ప్రజాప్రతినిధులు,
ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగితే గ్రామాల అభివృద్ధి సులభతరం అవుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, నీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్టాల్రు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన చట్టాలు చేశామని చెప్పిన మంత్రి.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని వెల్లడించారు.
సర్పంచ్‌లకు అనేక అధికారాలు కల్పించామని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్లలెలను మెరిసేలా చేయాలని అన్నారు. హరితహారం ద్వారా పంచాయతీల వారీగా ఎన్ని మొక్కలు నాటాలో గ్రామసభ ద్వారా తీర్మానం చేసి ఆ లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి పనులు చేపట్టాలని.. అలాంటి వారి ఫొటోలను గ్రామపంచాయతీలలో పెట్టాలని సూచించారు. గ్రామాల్లో చెత్తాచెదారం తొలగింపునకు గ్రావిూణ ఉపాధి హావిూ పథకాన్ని ఉపయోగించుకునే వెసలుబాటు కల్పించామని తెలిపారు. ఉపాధి హావిూ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను సర్పంచ్‌ల ఆజమాయిషీలోకి పరిధిలోకి తీసుకురానుండగా.. ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించినట్లు మంత్రి వివరించారు.