మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

-సర్పంచ్ నూకాల అనిత వేణుగోపాల్ రెడ్డి

కురవి ఆగస్టు -21
(జనం సాక్షి న్యూస్)

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మొగిలిచర్ల గ్రామ సర్పంచ్ నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో ఆదివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్లాంటేషన్ డే సందర్భంగా ఏవెన్యూ ప్లాంటేషన్లు స్థానిక ప్రభుత్వ పాఠశాల, డోర్నకల్ నుండి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన సర్పంచ్ నూకాల అనిత వేణుగోపాల్ రెడ్డి మొక్కలు నాటారు. అర్థ తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పిలుపుమేరకు అత్యధిక మొక్కలు నాటామని ఆమె తెలిపారు.గ్రామ నర్సరీల ద్వారా చాలా రకాల మొక్కలు అన్ని ఇవ్వడానికి ప్రతి సంవత్సరం సిద్ధంగా ఉంటాయని మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గీతానరేష్, వార్డు మెంబర్ బచ్చిని నాగేష్,ఫీల్డ్ అసిస్టెంట్ నాగేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.