మోటార్ వెహికల్ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

 

 

 

 

 

 జిల్లా ప్రిన్సిపల్ జడ్జి మరియు లీగల్ సర్వీసెస్ చైర్మన్ నారాయణబాబు.
భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్ 3 (జనం సాక్షి)
    మోటారు వెహికల్ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి మరియు లీగల్ సర్వీసెస్ చైర్మన్ నారాయణ బాబు అన్నారు. శనివారం
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పై అవేర్నెస్ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి మరియు లీగల్ సర్వీసెస్ చైర్మన్ నారాయణ బాబు  మాట్లాడుతూ వాహనం కలిగిన ప్రతి ఒక్కరికి వాహన వినియోగదారుల చట్టం పై అవగాహన ఉండాలని అన్నారు. వాహనం కలిగిన వ్యక్తికి లైసెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఆర్సి కార్డు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. టూవీలర్ నడుపుతున్న వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. మైనర్ పిల్లలకి వాహనం ఇచ్చినచో వారిపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మద్యం తాగి వాహనాన్ని నడప రాదని, మద్యం తాగి వాహనాన్ని నడిపితే ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అతివేగం వలన అనేక ప్రమాదాలు జరిగి వారి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు. చోదకులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ నడవాలని తెలిపారు. గూడ్స్ వాహనాలు అధిక లోడుతో   వెళ్లడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అలా వెళ్లవద్దని సూచించారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తు , వాహనదారులకు సూచనలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి కే . జయ రాంరెడ్డి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. రామ చందర్ రావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి రవీందర్, మహిళ జాయింట్ సెక్రెటరీ ప్రియాంక రెడ్డి, కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి, రమేష్ నాయక్, రాకేష్, వెంకటస్వామి, న్యాయవాదులు ఏదుల శ్రీనివాస్, ఆర్ల నాగరాజు, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.