మోడీపై పోలీస్ అధికారి భార్య పోటీ
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా సస్పెండైన ఐపీఎస్ అధికారి సంజీవ్‌భట్ భార్య శ్వేతను పార్టీ బరిలోకి దింపింది. మోడీ పోటీ చేస్తున్న మణీనగర్ నుంచి శ్వేత నేడు పార్టీ తరపున నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఈమె మోడీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. మోడీకి కంచుకోట అయిన మణీనగర్‌లో 2007 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 75 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ చర్యలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసి సంజీవ్‌భట్ వార్తల్లోకి ఎక్కారు.