మోడీ అమిత్ షా లు భయపడే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు
పెనుబల్లి, మార్చ్ 24(జనం సాక్షి) మోడీ, అమిత్ షా ఇద్దరూ రాహుల్ గాంధీ కి భయపడే రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు పెట్టి అనర్హత వేటు వేశారని, ఈ దుర్మార్గపు చర్యను, ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకు లు,సత్తుపల్లి మాజీ ఆత్మ ఛైర్మన్ నున్నా రామకృష్ణ శుక్రవారం ఒప్రకటనలో ఖండించారు,
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి దేశ సంపదను మోడీ అమిత్ షాలిద్దరూ ఆదానికి దోసి పెట్టిన నిజాలను, పార్లమెంటు సభలో ఆధారాలతో ప్రశ్నిస్తే, ఆదానీ కుటుంబం కోసం ఆదాని కుంభకోణం కోసం విషయాన్ని పక్కదోవ పెట్టించాలని దుర్బుద్ధితో తప్పుడు కేసు లు పెట్టారని అన్నారు, హైకోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా స్పీకర్ దుర్మార్గమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేశార ని అన్నారు, గతంలో ఇలాగే ఇందిరా గాంధీ ని కూడా అనర్హత వేటు వేసిన అలహాబాద్ కోర్టులో స్టే తెచ్చుకొని యధాతధంగా కొనసాగినటువంటి చరిత్ర ఉందని,ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో కూడా జరిగేది అదేజరుగుతుందని అన్నారు, పతనానికి దగ్గర పడ్డ మోడీ పాలనలో దేశం కోసం త్యాగాలు చేసినటువంటి గాంధీ కుటుంబాన్ని సమాజంలో అబాసు పాలు చేయాలనుకోవడం సూర్యుని మీద ఉమ్మి వేసే ప్రయత్నం అని మోడీ అమిత్ షాలు గుర్తుంచుకోవాలని అన్నారు, రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, భా వసారుప్యత కలిగిన పార్టీలు, మేధావులు ముక్తకంఠంతో ఈ దుచ్చర్యను ఖండిస్తున్నారని అన్నారు, 2024 ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా చేయాలని మోడీ అమీషా లాంటి సైంధవులు ఎన్ని కుట్రలు చేసినా ప్రధాని కావటం ఆపటం వారి తరం కాద ని అన్నారు,ఈ దుర్మార్గమైనటువంటి చర్యతో మీ పతనం మరింత బలపడినదని నియంత మోడీ గ్రహించాలని రాహుల్ గాంధీ కోసం దేశంలో కాంగ్రెస్ కార్యకర్త లంతా అండగా ఉంటారని మోదీని హెచ్చరిస్తున్నామ ని అన్నారు.