మోడీ ఇమేజ్‌కు కర్నాటక టెస్ట్‌

క‌ర్నాట‌క,(జ‌నం సాక్షి):కర్నాటక ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. మండు వేసవిలో నేతలు ప్రచార¬రుతో దూసుకుని పోతున్నారు. అధికార కాంగ్రెస్‌ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉంది. ఫలితాలు వచ్చాక తానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని మాజీ సిఎం ,బిజెపి నేత యెడ్యూరప్ప కూడా దీమాగా ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా కర్నాటక ఎన్నికలు ప్రధాని  మోదీకి అగ్ని పరీక్ష కానున్నాయి. రానున్న ఎన్నికలకు కర్నాటక లిట్మస్‌ టెస్ట్‌ లాంటివి. దక్షిణాదిలో పాగా వేద్దామనుకుంటున్న బజెపికి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత దేశ రాజకీయ సవిూకరణాలు మారనున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రక ఎన్నికల్లో రాజకీయపోరు ఎలా ఉంటుందా అని చెప్పేందుకు ఈ సవిూకరణాలు తోడ్పడతాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేయాలన్న లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నప్పటికీ ఆ లక్ష్యానికి అక్కడక్కడా విఘాతం కలుగుతోంది. గుజరాత్‌ ఫలితాలు, రాజస్థాన్‌ ఉప ఎన్నికల ఫలితాలు ఆయన లక్ష్యం ఇప్పట్లో నెరవేరదని రుజువు చేశాయి. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను తుడిచిపెట్టడం సాధ్యమవుతుందని  గట్టిగా చెప్పడానికి లేకుండా పోయింది. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ సంగతి ఎలా ఉన్నా మోడీకి మాత్రం ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. బిజెపిని  ఏకవ్యక్తి  నియంత్రణ కిందకు తెచ్చుకున్న మోడీ తానుపట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న రీతిలో మొండిగా సాగుతున్నారు. ఇకపోతే రాహుల్‌ కూడా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు 
చేపట్టిన తరవాత మోడీకి దీటైన నేతగా దూసుకుని పోతున్నారు. పిల్లకాకి అని విమర్శించిన వారే గుజరాత్‌, తదితర ఫలితాలు చూశాక ఆయనను తక్కువగా అంచనా వేయడం లేదు. దీనికితోడు దేశంలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయి. కర్నాటక  ఎన్నికలకు ఇక మిగిలింది కేవలం తొమ్మది రోజపులే. అయినా కాంగ్రెస్‌ పట్ల పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. దేశ రాజకీయాల్లో  తిరుగులేని నేతగా ఎదిగిన మోదీకి  కర్ణాటక ప్రజలు అవకాశం ఇస్తారా లేదా అన్న విషయం ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. సర్వేలు కూడా బలంగా చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే రాహుల్‌ కూడా రాజకీయాల్లో రాటుతేలాడు. మోడీని గట్టిగానే ఢీకొంటున్నాడు. విమర్వలకు ధీటుగా జవాబిస్తున్నాడు. అందుకే  ప్రతి ఎన్నికలోనూ గెలుస్తాం అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గత ఆదివారం ఢిల్లీలో జరిగిన జనాక్రోశ్‌ ర్యాలీలో కాంగరెస్‌ శ్రేణులకు భరోసా ఇచ్చాడు. ఢిల్లీ ఆందోళన తరవాత కాంగ్రెస్‌లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే కర్ణాటకలో సునావిూ సృష్టిస్తామని, సిఎంగా యెడ్యూరప్ప ప్రమాణం చేస్తారని ప్రధానమంత్రి మోదీ ఎన్నికలసభల్లో చెప్పారు. కారణౄలు ఏవైనా  కర్ణాటకలో కాంగ్రెస్‌, బిజెపి నేతల్లో ఎవర్ని కదిలించినా తామే  అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.కర్నాకటలో ఐదేళ్ల సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నా అది బిజెపిని అధికారంలోకి తీసుకుని వచ్చేంతగా లేదన్నది సత్యం. యెడ్యూరప్పపైనా అవినీతి మరక ఉండడం, ఆయన జైలుకు వెళ్లడం లాంటి విషయాలు బలంగా ప్రచారం అవుతున్నాయి.  అందుకే సిఎం సిద్దరామయ్యతో స్వయంగా మోడీ ఢీ అంటున్నారు. అందుకే ఈ ఎన్నికలు మోడీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి. మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు ఓటముల ఘనత మోదీయే స్వీకరిస్తున్నారు. అలాగే బిజెపి అంటే పాత రోజులు పోయాయి. గతంలో మేఉధావుల ఉమ్మడి నాయకత్వంలో బిజెపి నడిచింది. ఇప్పుడు కేవలం మోడీ, అమిత్‌షాల ఆధ్వర్యంలో బిజెపి కుంచించుకు పోయింది.  కనుక కర్ణాటకలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మోడీకే మారింది. దేశంలో మోదీ పనితీరుపై ప్రజలు విసుగు చెందుతున్నారు. బ్యాంకుల్లో మోసాలు, నగదు కొరత, జిఎస్టీ వాయింపులు,
ధరల పెరుగుదల, సామాన్యులకు అందుబాటులో లేని విధంగా కార్యక్రమాలు చికాకు కలిగిస్తున్నాయి.
అందుకే మోడీ పనితీరుకు కూడా కర్నాటక ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. రాహుల్‌ కూడా ప్రధానంగా మోడీ పనితీరుపైనే ప్రచారం చేప్టటడం వెనక ఆంతర్యం కూడా ఇదే అయివుంటుంది. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌, ఫూల్‌పూర్‌ ఉప ఎన్నికల్లో బిఎస్పి, ఎస్‌పి కలిసి పోటీ చేసినందువల్ల బిజెపికి ఊహించని ఓటమి లభించి ఉండవచ్చు కాని కర్ణాటకలో మొదటిసారి కాంగ్రెస్‌తో బిజెపి ఢీకొంటున్నది. 2014 తర్వాత బిజెపితో నేరుగా ఢీకొని తన సత్తా నిరూపించుకునే అవకాశాలు అరుదుగా లభించాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బిజెపిని గట్టిగా ఢీకొని ముచ్చెమటలు పోయించింది. ఆ తర్వాత రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో కూడా బిజెపిని చిత్తుగా ఓడించింది. దీంతో రాహుల్‌గాంధీలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. వివిధ పార్టీలు కూడా మళ్లీ కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమికి సై అంటున్నాయి. ఈ దశలో కర్నాకట ఎన్‌ఇనకల ఫలితాలు అన్నవి మోదీకి అసలైన అగ్నిపరీక్ష కాబోతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్‌ ఓడితే ప్రభుత్వ వ్యతిరేకతగా సరిపెట్టుకోవచ్చు. కానీ కాంగ్రెస్‌ గెలిస్తే మోడీ అసమర్థతగా దేశశ్యాప్తంగా ప్రచారం సాగుతుంది. దక్షిణౄదిలో మోడీ పప్పులు ఉడకవని అప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు కూడా గొంతె/-తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే
కర్ణాటకలో పూర్తిగా మోదీ ఆకర్షణ ద్వారా ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితి బిజెపికి లేదు. అందుకే విజయం సాధించడానికి బిజెపి లింగాయత్‌, వక్కలిగ, గిరిజన ఇంకా వివిధ సామాజిక వర్గాల ఓట్లశాతంపై నమ్మకం పెట్టుకుంటున్నది. మైనింగ్‌ అక్రమాలకు పాల్పడ్డ గాలి జనార్దన్‌రెడ్డిని కూడా విస్మరించలేని శక్తిగా గుర్తించాల్సి వచ్చింది. అంతర్లీనంగా హిందూత్వ భావనల్ని ప్రజల్లో రేకెత్తేందుకు ప్రయత్నిస్తున్నది. జనతాదళ్‌ (ఎస్‌) బలోపేతమయితే కాంగ్రెస్‌ సంఖ్యాబలం తగ్గుతుందనే ఆలోచన కూడా బిజెపిని ఆ దిశగా వ్యూహరచన చేసేందుకు పురికొల్పుతోంది. ఇవన్నీ ఏ మేరకు ఫలిస్తాయన్నది ఈ నెల 15న ఫలితాలను బట్టి తేలనుంది.