మోడీ నిర్ణయంపై సెహ్వాగ్‌ – భజ్జీల ట్వీట్…

downloadప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నిజానికి మోడీ నిర్ణయం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్లకుభేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కానీ, చాలామంది సెలబ్రిటీలు మాత్రం మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నట్టింట్లోనే కాదు, నెట్టింట్లోనూ కరెన్సీ గోలే టాప్‌ ట్రెండింగ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపైనే చర్చించుకుంటున్నారు. మోడీ నిర్ణయంపై గత రాత్రి సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు చేశారు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. అమెరికాలో ఓట్ల కౌంటింగ్‌ జరుగుతుంటే.. ఇండియాలో నోట్ల కౌంటింగ్‌ జరుగుతోంది. భారత్‌లో ఈ రాత్రి చాలా ఇళ్లలో లైట్లు ఆఫ్‌ కావు.. భారత టర్బోనేటర్ హర్భజన్‌ సింగ్ స్పందిస్తూ… మోడీజీ.. మీరు సూపర్‌ సిక్సర్‌ కొట్టారు. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.