మోడీ స్టేడియం పేరు మార్చాలి
ప్రముఖ క్రికెటర్ పేరు పెడితే మంచిది
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిన నేపథ్యంలో, నరేంద్ర మోడీ స్టేడియానికి ఒక క్రికెటర్ పేరు పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని మోటెరా నగరంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం పేరు మార్చాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్‌లో కోరారు.‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిన తర్వాత, ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియానికి క్రికెటర్ పేరిట మార్చాలని మేం ప్రధానిని కోరుతున్నాం. అలాగే ఢల్లీిలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి కూడా క్రికెట్ లెజెండ్ పేరు పెట్టండని ఎంపీ రేవంత్ ట్వీట్ చేశారు. మోటెరాలోని సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్దానికి దారి తీసింది.బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించే మొత్తాన్ని 230 కోట్లకు తగ్గించిన మోదీ.. పెగాసస్, ద్రవ్యోల్బణం, సాగుచట్టాల వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్చడం మోదీ సంకుచిత బుద్ధికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఢల్లీిలో విూడియాతో మాట్లాడుతూ.. ఖేల్ రత్న పురస్కారం పేరు మార్చచడాన్ని దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. రాజీవ్ ఖేల్‌రత్న పేరు మార్చిన ప్రధాని.. అహ్మదాబాద్‌లో మోదీ స్టేడియం పేరునూ మార్చి క్రీడాకారుడి పేరు పెట్టాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పలువురు నెటిజన్లు, విపక్ష నేతలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, క్రీడా మైదానాలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లోని స్టేడియానికి మోదీ పేరును తీసేసి, ప్రముఖ క్రీడాకారుల్లో ఎవరో ఒకరి పేరు పెట్టాలని సోషల్ విూడియాలో డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా క్రీడా మైదానాలకు కేవలం క్రీడాకారుల పేర్లే పెడతారని ఆశిస్తున్నానని కిక్రెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేయడం గమనార్హం.