మోదీ గారూ.. ఫ్లైఓవర్‌ ఇంకా ఎన్నేళ్లు కడతారు? కేంద్రం వివక్షను ఎండగడుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు

హైదరాబాద్‌ : తెలంగాణపై మోదీ వివక్షను ఎండగడుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్‌ – నారపల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణంలో మోదీ సర్కార్‌ నాన్చుడు ధోరణిపై ప్రజలు నిరసన తెలుపుతూ ఈ పోస్టర్లు అతికించారు. భారత్‌మాల ప్రాజెక్టు కింద ఉప్పల -నారపల్లి ఫ్లైఓవర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. అయితే ఐదేండ్లు అయినా ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు 40 శాతం వర్క్‌ కూడా పూర్తి కాలేదు. ఫ్లైఓవర్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి విన్నవించుకున్నా స్పందన కరవైంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఫ్లైఓవర్ల నిర్మాణాలను పూర్తి చేస్తూ ఓపెనింగ్‌ చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలా నాన్చుడు ధోరణి ప్రదర్శించడంతో జనాలు విసుగెత్తిపోయారు. దీంతో ఇలా పోస్టర్లు రూపంలో తమ నిరసనను తెలిపారు.