మోదీ మాటల్లో చెప్పినవి… 

చేతల్లో కనిపించవు
– కర్ణాటకలో ఎనిమిది మంది అవినీతి పరులకు టికెట్లు ఇచ్చారు
– 23కేసులున్న వ్యక్తిని  సీఎం అభ్యర్థిగా ప్రకటించిన ఘనత విూది
– ఈ విషయాలపై ఓ ఐదు నిమిషాలు మాట్లాడగలవా?
– పేపర్‌ చూసి మాట్లాడొచ్చు.. విూ సమాధానం కోసం ఎదురుచూస్తుంటా!
– ట్విట్టర్‌ వేదికగా మోడీకి సవాల్‌ విసిరిన రాహుల్‌
న్యూఢిల్లీ, మే5(జ‌నం సాక్షి ) : కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ మధ్య మాటల వార్‌ తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆ రాష్ట్రంలోని భాజపా మహిళా మోర్చా కార్యకర్తలతో ప్రధాని మోదీ ‘నమో యాప్‌’ ద్వారా మాట్లాడిన విషయం తెలిసిందే. భాజపా ప్రభుత్వం మహిళా సంరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నా కాంగ్రెస్‌ దుష్పచ్రారం చేస్తోందన్న ఓ కార్యకర్త మాటలకు స్పందించిన మోదీ ‘అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్‌ నైజం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్ల దాడికి దిగారు. మోదీ ఎక్కువగానే మాట్లాడతారు.. కానీ అందులో ఏదీ చేతల్లో చూపరంటూ ఓ వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. డియర్‌ మోదీజీ… విూరు చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ సమస్య ఏంటంటే విూ మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. విూ మాటల్లో ఉన్న నిజాయతీ కర్ణాటక భాజపా అభ్యర్థుల ఎంపికలో లేదు. ‘కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌’ ఎపిసోడ్‌లా విూ మాటలున్నాయి. అవినీతిపరులైన గాలి బ్రదర్స్‌కు అత్యంత సన్నిహితులైన ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చారు. ఈ విషయంపై ఓ ఐదు నిమిషాలు మాట్లాడగలరా?. విూ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పపై చీటింగ్‌, అవినీతి, ఫోర్జరీ వంటి 23కేసులున్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్రానికి సీఎం కావాలనుకుంటున్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలేనా? భాజపాలోని 11మంది అగ్రనేతల అవినీతిని గురించి ఎప్పుడు మాట్లాడతారు?. శ్రీరాములు అనే భాజపా మాజీ మంత్రిపై మూడు కేసులున్నాయి. గాలి జనార్దన్‌ రెడ్డి సోదరుడైన సోమశేఖర రెడ్డిపై ఐదు క్రిమినల్‌ కేసులున్నాయి. కంపాలి నుంచి పోటీ చేస్తున్న గాలి అనుచరుడిపై ఆరు క్రిమినల్‌ కేసులున్నాయి. భాజపాకు చెందిన మాజీ హౌసింగ్‌ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడుపై నాలుగు క్రిమినల్‌ కేసులున్నాయి. చిక్కమంగళూరు అభ్యర్థిపై మూడు క్రిమినల్‌ కేసులన్నాయి. ప్రస్తుతం భాజపా ఎంపీగా కొనసాగుతున్న శోభా కరణ్‌ డ్లజేపై మనీ లాండరింగ్‌ కేసు ఉంది. వీటన్నింటిపై విూరు నోరువిప్పుతారని ఆశిస్తున్నాను. విూ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను. కావాలంటే విూరు చేతిలో పేపర్‌ పట్టుకునే సమాధానం చెప్పొచ్చు’ అంటూ రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా మోదీకి సవాల్‌ విసిరారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరగున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇంకో
ఏడు రోజులే ఉన్నందున పార్టీలు ఒకదానిపై మరొకటి మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈనెల 15న ఫలితాలు వెలువడనున్నాయి.