మోదీ సర్‌… ఆ వివరాలేవో బయటపెట్టండి

– ట్విట్టర్‌లో మోడీకి సిద్ధిరామయ్య సవాల్‌
బెంగళూరు, మే5(జ‌నం సాక్షి ) : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. శుక్రవారం భాజపా మహిళా మోర్చా సమావేశంలో భాగంగా ‘అవినీతి చేయడం కాంగ్రెస్‌ నైజం’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. ఈ మేరకు మోదీపై ట్వీట్ల దాడికి దిగారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ‘డియర్‌ మోదీ సర్‌… సంక్షేమం పేరుతో కాంగ్రెస్‌ నిధులు లూఠీ చేస్తోందని విూరు వ్యాఖ్యానించారు. అందుకు ఆధారాలేమైనా ఉన్నాయా? బెంగళూరును స్మార్ట్‌సిటీగా మార్చడానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశామని విూరు అన్నారు కదా సర్‌..! విూ వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే విూడియా ముందు ప్రవేశపెట్టండి. విూరు అవినీతి గురించి మాట్లాడటం విని నేను ఆశ్చర్యపోయాను. ప్రస్తుతం అదే విూ బలహీనత. విూ అభ్యర్థుల ఎంపికలోనూ అవినీతే ఉంది. రాబోయే ఎన్నికల్లో రెడ్డి బ్రదర్స్‌ ఎలా, ఎందుకు గెలవాలో ఓ ఐదు నిమిషాలు మాట్లాడగలరా? గాలి బ్రదర్స్‌ అవినీతిని సీబీఐ కూడా ఏం చేయలేకపోతే మేం చేస్తాం. మేం వాళ్లకు బుద్ధి చెప్తాం. ప్రస్తుతం సిట్‌ కూడా అదే పనిలో ఉంది. అవినీతి కేసులో జైలు పాలైన భాజపా సీఎం, అతని అరడజను మంది సహచరుల గురించి కర్ణాటక ప్రజలకు బాగా తెలుసు’ అని ట్వీట్‌ చేశారు.
ర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈనెల12న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ఫలితాలు ఈనెల 15న వెలువడనున్నాయి.