మౌంట్ ఒపేరాలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్(జనంసాక్షి): నగర శివారులో ఉన్న పర్యాటక కేంద్రం మౌంట్ ఒపేరాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ రేసింగ్ విభాగంలో ఉన్న టైర్లకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పర్యాటకులు అంతా వెళ్లిపోయిన తర్వాత ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరంగలేదు. మౌంట్ ఒపేరా సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.