యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు.

మల్లాపూర్ ఆగస్టు30 (జనం సాక్షి) యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాలలో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ప్రేమకి, గౌరవానికి ప్రతీక గా జరుపుకునే ఈ పండగను పురస్కరించుకొని,నీవు నాకు రక్షా… నేను నీకు రక్షా… మనిద్దరం దేశానికి రక్షా… అంటూ విద్యార్థులందరు ఒకరికొకరు రాఖీ లు కట్టుకున్నారు..రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.. ఈవిధంగా పండగ యొక్క ప్రాముఖ్యత ను విద్యార్థులకి చెప్పడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు షహభాజ్ హుస్సేన్,