యనమల ఇంటిని ముట్టడించిన భోజన కార్మికులు
కాకినాడ,ఆగస్ట్28(జనం సాక్షి): ప్రైవేటు సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించరాదని కార్మికులు మంగళవారం రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంటిని ముట్టడించారు. పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని వారు భీష్మించుకు కూర్చున్నారు. మెనూ చార్జీలు పెంచాలని, ఐదు వేలు కనీస వేతనంగా ఇవ్వాలని కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు మంత్రి ఇంటి ముందు కార్మికులు బైటాయించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. బేబీ రాణి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో దాదాపు 300 మంది పాల్గొన్నారు.