యాదగిరికి తెదేపా శ్రేణుల నివాళులు
ఆదిలాబాద్, విద్యావిభాగం: తెదేపా సీనియర్ నేత ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి మృతికి సంతాప సూచకంగా ఆదిలాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం సంతాపసభను ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరసింగ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అశోక్, నాయకులు అలీ, ఖుర్షీద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.