యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5000 కోట్ల రూపాయలు కేటాయించాలి :తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు,

యాదవులు సామాజిక, ఆర్థికంగా,రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారగోని శ్రీనివాస యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు  ఎంపీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్లో 5000 కోట్ల  రూపాయలు కేటాయించాలని  కోరారు. అదేవిధంగా 1955 సంవత్సరం నుండి 1970 వరకు ఉన్న ఎస్ ఎన్ టి (రిజర్వేషన్ సెమీ నోమాటిక్ ట్రైబ్స్ ) అర్థ సంచార జాతుల రిజర్వేషన్లు 1977లో తీసివేయడం జరిగిందని  దానిని వెంటనే తిరిగి పునరుద్ధరించాలని ఇదే విషయంపై ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన అమలు కాలేదని అన్నారు. వెంటనే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎస్ ఎన్ టి రిజర్వేషన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 20 – 20 22 తేదీ నుండి జాతీయ అధ్యక్షులు తెలంగాణలో ఉన్న అన్ని యాదవ సంఘాలను మద్దతు కూడా కట్టుకొని జగిత్యాల జిల్లా కొండగట్టు దేవస్థానము నుండి మహా పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఈ పాదయాత్ర కొనసాగిస్తామని అన్నారు.