యాదాద్రి తరవాత వేములవాడ పుర్నిర్మాణం
శృంగేరి పీఠం సూచనలు సలహాల మేరకు పునరుద్దరణ
ఇప్పటికే వందకోట్లు కేటాయించాం
వేములవాడను దర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములవాడ,అగస్టు11(జనం సాక్షి): యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శృంగేరి పీఠం వారి సూచనలు సలహాల మేరకు ఆలయ అభివృద్దికి పూనుకుంటామని అన్నారు. ఇప్పటికే వందకోట్లు కేటాయించామని, మరో 50కోట్లు కేటాయిస్తామని అన్నారు. వేములవాడ పర్యటనలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాగారంలోరూ.36 లక్షల అంచనా వ్యయంతో పునఃనిర్మించనున్న కోదండ రామాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం వేములవాడలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన భీమేశ్వర స్వామి అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజన్న ఆలయానికి వీటీడీఏ నుంచి ఇప్పటి వరకు రూ.100 కోట్లు పెట్టాం. మరో రూ.50 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే 30 ఎకరాల ల్యాండ్ ను ప్రైవేట్ నుంచి తీసుకున్నారు. రాబోయే రోజుల్లో శృంగేరి పీఠం ఇచ్చిన నమునా ప్రకారం అబివృద్ధి జరిగుతుందన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయం సామాన్యులకు అండగా ఉందన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది భక్తులు రాజన్నను దర్శించు కుంటారని మంత్రి తెలిపారు. యాదాద్రి తర్వాత రాజన్న ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుం దన్నారు. భక్తులకు గదుల కొరత ఉండడంతో కొత్తగా 60 వసతి గదులు నిర్మించామని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో సైతం రాజన్న ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ జిల్లాను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. కరొనా కారణంగా కొత్త ఆదాయం తగ్గింది. అయినా సంక్షేమ మాత్రం ఆగడం లేదన్నారు. దళితబంధు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ..వేములవాడలో ఇప్పటికే రూ.280 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఆలయ అభివృద్ధి పై త్వరలోనే మంత్రి కేటీఆర్ తో సవిూక్ష సమావేశం ఉంటుందన్నారు.