యానాదిరెడ్డి నిందితులను అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
నెల్లూరు, జూన్ 27 : కావలి పట్టణంలో ఎం. యానాదిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులను వెంకటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బుధవారం ర్యాలీలు నిర్వహించారు. స్థానిక కోఆపరేటీవ్ కాలనీలోని గీతాంజలి ఇంగ్లిష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ యానాదిరెడ్డిని మంగళవారం సాయంత్రం 6.30 ప్రాంతంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్యలో రియాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రియాజ్ ఉన్మాదిలా ప్రవర్తించి యానాదిరెడ్డి హత్యకు పాల్పడ్డాడనని పోలీసులు తెలిపారు. ఇందులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా యానాదిరెడ్డి హత్యకుగల కారణాలు వెల్లడికాలేదని కేసును పరిశీలిస్తున్న రెండవ పట్టణ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనాన్ని కలిగించింది.