యుఎన్‌వో, డబ్ల్యూహెచ్‌వో – ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం
తిరుపతి, జూలై : వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా లెక్కల గణన చేపట్టింది. ప్రపంచ జనాభా 1987 జూలై 11న ఐదు బిలియన్లుగా నిర్ణయించింది. ఆనాటి నుంచి జూలై 11ను ప్రపంచ జనాభా గణన దినోత్సవంగా యుఎన్‌వో, డబ్ల్యూహెచ్‌వో నిర్వహిస్తోంది. ప్రపంచ జనాభా నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టింది. ప్రపంచ జనాభా నియంత్రించేందుకు బిడ్డకు బిడ్డకు మధ్య కొంత వ్యవధి ఎంతైనా అవసరమని పేర్కొంది. ఆడవారికి 18 సంవత్సరాలు, మగవారికి 22 సంవత్సరాలు దాటిన అనంతరంమే వివాహం అని వివరించింది. చిత్తూరు జిల్లా వి-కోట ఆరోగ్య కేంద్రంలో గత సంవత్సరం 350 సాధారణ ప్రసవాలు జరిగాయి. మూడు ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి లలితకుమారి బుధవారం నాడు వెల్లడించారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రి నుంచి స్విమ్స్ ఆసుపత్రి వరకు వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ వెంగమాంబ మాట్లాడుతూ, ఒక బిడ్డ ముద్దు – రెండో బిడ్డ వద్దు అన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ప్రపంచ జనాభాలో భారతదేశం రెండవ స్థానంలో ఉండడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ అండ్ ఎస్ రమాదేవి, అదనపు డిఎం అండ్ హెచ్‌వో భారతీరెడ్డి, డిఈవో సురేఖ, రెడ్ క్రాస్ సంస్థ సెక్రటరీ రామలక్ష్మమ్మ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.