యుద్దం కొనసాగితే ఆర్థిక నష్టాలు ఎక్కువే

భారత్‌ లాంటి దేశాలకు చమురు వదులుతుంది
ఉక్రెయిన్‌తో పాటు అన్ని దేశాలకు కూడా నష్టమే
న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): ఉక్రెయిన్‌ యుద్దం ఇలాగే కొనసాగితే కలిగే నష్టం భారీగానే ఉంటుంది. ప్రధానంగా చములరు ధరలు పెరిగి భారత్‌ లాంటి దేశాలపై ఆర్థిక భారం విపరీతంగా పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. జెపి మోర్గాన్‌ చెబుతున్నదాని ప్రకారం 150 డాలర్ల వరకు ముడిచమురు ధర పెరగవచ్చు. అదే జరిగితే ప్రపంచ జిడిపి వృద్ధి రేటు కేవలం 0.9 శాతానికి పడిపోతుంది. మన దేశ టోకు ధరల సూచికలో చమురు సంబంధిత ఉత్పత్తులు తొమ్మిది శాతం ఉంటాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం 0.9 శాతం పెరుగుతుందని అంచనా. మరోవైపున కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ మరింత పెరుగుతుంది. ఎరువులు, వంటగ్యాస్‌ ధరలను పెంచన్లటైతే ఆ మేరకు అదనంగా సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కేంద్రం భరిస్తుందా జనం విూదే మోపుతుందా అన్నది చూడాల్సి ఉంది. మన దిగుమతు ల్లో ఒక్క చమురే నాలుగో వంతు ఉన్నందున దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మోటారు వాహనాలు, మొబైల్‌ ఫోన్లకు అవసరమైన పల్లాడియం అనే లోహపు ధర ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మరింతగా పెరగటంతో లభ్యత సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఉక్రెయిన్‌
పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్థిక లబ్ది పొందేందుకు అమెరికా పథకం వేసిందనే వాదన కూడా వుంది. అక్కడి మిలిటరీ`పారిశ్రామికవేత్తలకు ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే వారి ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చన్న ఎత్తుగడలో ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్నది ఇదేనన్న వాదనా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రెచ్చగొట్టినన్ని ఉద్రిక్తతలు, యుద్దాలు మరొక దేశం వైపు నుంచి లేవన్న విమర్శలు ఉన్నాయి. రేథియాన్‌ అనే అమెరికన్‌ కంపెనీ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారు చేస్తుంది. ఉక్రెయిన్‌ లేదా ఇతర భద్రతా ముప్పులు అంతర్జాతీయ అమ్మకాలకు అవకాశాలను కల్పిస్తుందని నమ్ముతున్నారు. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. దీని వలన ద్రవ్య సరఫరా పెరుగుతుంది. బాండ్ల రేటు స్ధిరపడుతుంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయన్నది బహిరంగ రహస్యంగా చెబుతారు.
నాటోను విస్తరించబోమని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మాస్కోకు వాగ్దానం చేసినప్పటికీ తరవాతి పరిణామాల్లో దానిని మరిచపోయారు. తూర్పు వైపు నాటో విస్తరణ జరగదని వాగ్దానం చేశారని డిసెంబరు నెలలో వ్లదిమిర్‌ పుతిన్‌ పత్రికా గోష్టిలో చెప్పారు. 1999లో పోలాండ్‌, హంగరీ, చెకియాలను, 2004లో మాజీ సోవియట్‌ రిపబ్లిక్కులు ఎస్తోనియా, లాత్వియా, లిధువేనియాలను చేర్చుకున్నారు. దీంతో నాటో దళాలు రష్యా లోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరానికి 135 కిలోవిూటర్ల దూరం లోకి వచ్చినట్లయింది. మరోవైపు నుంచి ఇంకా దగ్గరకు వచ్చేందుకు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలని నాటో నిర్ణయించింది. ఇదే తాజా ఉద్రిక్తతలకు దారితీసింది. గతంలో తీర్మానాలతో నిమిత్తం లేకుండానే అమెరికా, ఇతర నాటో దేశాలు గతంలో ఇరాక్‌ విూద దాడి చేసినప్పటికీ భద్రతామండలి చేసిందేవిూ లేదు. మొత్తంగా పరిణామాలు ఎలా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రం అస్తవ్యస్థం అయ్యింది. చమురు దరల పెరుగుదల, ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల రాక భారత్‌కు తీరని ఆర్థికనష్టం కలుగచేస్తుంది.