యుద్ధభేరి గోడపత్రికలు విడుదల

కాశిపేట గ్రామీణం: ఈనెల 28న ఎమ్మార్పీఎన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ (ఉప్పల్‌)లో జరగనున్న వృద్ధుల, వితంతువుల యుద్ధభేరి గోడపత్రికలను స్థానిక ఎమ్మార్పీఎస్‌ నాయకులు విడుదల చేశారు. ఈ యుద్ధభేరికి మండలంలోని ప్రజలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఇన్‌ఛార్జి లంక లక్ష్మణ్‌ కోరారు.