యువకుడి దారుణహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని మాటేగాం చెరువులో శుక్రవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని హంపోలి గ్రామానికి చెందిన తమ్ముల  చిన్నన్న(30) ను గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయిలో మోది హత్యచేశారు. రూలర్‌ సీఐ సీతరాములు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హంపోలి గ్రామానికి చెందిన తమ్ముల చిన్నన్న వ్యవసాయ పనులు చేస్తుంటాడు.శుక్రవారం మరో ఇద్దరితో కలిసి మాటేగాం గ్రామానికి వచ్చాడు. స్థానిక కల్లు దుకాణంలో కల్లు తాగి విక్రయదారుడు భూమారెడ్డి రూ. 500 నోటు ఇచ్చాడు.

అలడు రెండు సీసాల డబ్బులు తీసుకుని మిగతా చిల్లర చిన్నన్నకు ఇచ్చేశారు. దీంతో చిన్నన్న అక్కడి నుంచి మాటేగాం శివారులో ఉన్న తన పొలానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారం మేరకు డీఎస్పీ దేవిదాస్‌ నాగులతోపాటు పోలిసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, చిన్నన్నను ఎవరు హత్య చేశారనే విషయం తెలియరాలేదు. అతడు జేబులో డబ్బులు కూడా లేవు.  చిల్లర డబ్బుల కోసం హత్య జరిగి ఉండవచ్చని పోలిపులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.