యువకుడి దారుణ హత్య
విజయవాడ, జూన్ 24 : మండవల్లి మండలం కొనకంచి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం రామకృష్ణ చౌదరి అనే యువకుడి మృతదేహం గ్రామంలోని చెరువు వద్ద పడి ఉంది. స్థానికులు దానిని గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అనేక గాయాలు ఉన్నాయి. దీంతో ఇది హత్యేనన్న నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ కోణం నుండి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ గ్రామానికి చెందిన ఒక యువతితో చౌదరి సాగిస్తున్న ప్రేమాయణం పెద్దలకు తెలియడంతో ఈ హత్య జరిగిందంటున్నారు. పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు.