యువతి ఆత్మహత్య
కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన మమత(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మమత జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది.