యువత సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలి : కలెక్టర్‌

మెదక్‌, నవంబర్‌ 6 : యువశక్తి యువజన సంఘం ఫసల్‌వాది సంగారెడ్డిలో ఈ రోజు పుర్ర శ్రీనివాస్‌ యువజన నాయకుడు ప్రథమ వర్థంతి సందర్భంగా యోగా, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ ఏ.దినకర్‌బాబు వచ్చేసి ప్రసంగిస్తూ యువత  సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అంతేగాక, రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డి. ఆంజనేయశర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు యువతకు సంబంధించి ముఖ్యమంగా రాజీవ్‌ యువశక్తి ద్వారా యువత లబ్దిపొందాలని కోరారు. జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు వేణుగోపాల్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ జిల్లా కలెక్టర్‌ ద్వారా యువజన సంఘాలకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని దానిని యువజన సంఘాలు ఉపయోగించుకోవాలని, గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సంగారెడ్డి తహశీల్దారు, ఎంపిడిఓ, నెహ్రూ యువజనకేంద్ర అధికారి కృష్ణారావు, డివిజన్‌ ఆర్గనైజర్‌ జగదీశ్వర్‌, యువకులు తదితరులు పాల్గొన్నారు.