యూత్ అధ్యక్షుడుగా హుస్సేన్ నాయక్

డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి
కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడిగా గుగులోతు హుస్సేన్ నాయక్ ను నియమించినట్లు కంకర అప్పయ్య రెడ్డి తెలియజేశారు.శనివారం జిల్లా కేంద్రంలో మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హుస్సేన్,పుర అధ్యక్షుడిగా
బండేటి రాంకోటేష్ లను నియమాక పత్రాలు అందించినట్లు జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. నియోజకవర్గ నేత రామచంద్రనాయక్ సూచనల మేరకు మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. తమ ఎంపికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి, కాసం శేకర్,బోడ రమేష్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోత్ రాము,మాజీ వైస్ ఎంపీపీ బెల్లం వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.