యూనిఫామ్ లను త్వరగా పాఠశాలలకు అందజేయాలి.
నోడల్ ఆఫీసర్
ఉండ్రాతి సుజన్ తేజ.
జనం సాక్షి, చెన్నరావు పేట
చెన్నారవుపేట మండలం లోని అన్ని పాఠశాలలకు సంబంధించిన యూనిఫామ్ ల గురించి మేర సంఘం వారితో మీటింగ్ ను ఏర్పాటు చేసి నర్సంపేట లోని యూనిఫామ్ స్టిచ్చింగ్ గోదాం ను పరిశీలించిన నోడల్ ఆఫీసర్
ఉండ్రాతి సుజన్ తేజ. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వారం లో తప్పకుండా పాఠశాలలకు యూనిఫామ్ ను అందజేయాలని, మన ఊరు మనబడి అభివృద్ధి పనుల గురించి ప్రధానోపాధ్యాయులు తో మాట్లాడడం జరిగిందనీ, త్వరగా పనులను పూర్తి చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.అన్ని
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఫార్మటివ్ 1, 2 కు సంబంధించిన మార్కులను ఆన్లైన్ లో నమోదు చేయాలని తెలిపారు.అన్ని పాఠశాలలో ప్రతి మంగళవారం క్లీన్ ఇండియా, ప్లాస్టిక్ వేస్ట్ కలెక్షన్ ప్రోగ్రాం ను విజయవంతం చేయాలని కోరారు. అన్ని ప్రాథమికోన్నత, హైస్కూల్ పాఠశాలలు ఇన్స్పైర్ అవార్డుల నామినేషన్ లను ఈనెల 15 వరకు ఆన్లైన్ లో పూర్తి చేయాలని తెలిపారు. అన్ని పాఠశాలలు శాలసిద్ధి వెబ్సైట్ లో పాఠశాల పూర్తి సమాచారంను నమోదు చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ సంపత్, మేర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.