యూపీఏకు మద్దతు కొనసాగిస్తాం: ఎన్సీపీ
న్యూఢిల్లీ: యూపీఏకు ప్రభుత్వానికి 2014వరకు మద్దతు కొనసాగిస్తామని ఎన్సీపీ నేత, కేంద్ర మంత్రి ప్రణుల్ పటేల్ ప్రకటించారు. అయితే మంత్రివర్గంలో కొనసాగాలా లేదా అనే విషయంపై రేపుగాని ఎల్లుండిగాని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాము మంత్రివర్గంలో కొనసాగినా లేకపోయినా యూపిఏలో మాత్రం కొనసాగుతామన్నారు.