యూరియ కోసం రైతుల మధ్య తోపులాట

కరీంనగర్‌: ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్‌లో ఎరువుల కోసం రైతులమధ్య తోపులాట జరిగింది. ఆదివారం రాత్రి 20టన్నుల యూరియా దిగుమతయింది. వీటికోసం ఉదయం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బస్తాలకోసం ఘర్షణ పడ్డారు. ఒక్కొక్కరికి రెండు బస్తాలు అందాయి. ఎరువులు అందని రైతులు నిరాశ చెందారు.