యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు..
వరంగల్ ఈస్ట్, జూన్ 21(జనం సాక్షి):
వరంగల్ లోని ఖిలా వరంగల్ లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. పలురకాల యోగా ఆసనాలు వేసి యోగా ప్రత్యేకత గురించి వివరించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ యోగ మానసిక ప్రశాంతతను ఇస్తుందన్నారు..యోగా ఆరోగ్యానికి మంచిది.యోగా చేయడం ద్వారా ప్రశాంతత నెలకొంటుంది.యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..
ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయరు గుండు సుధారాణి ,కార్పోరేటర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు..
