యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగా వల్ల మానసిక ఉత్తేజం , శారీరక దారుఢ్యం
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే ను పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సకల మానవాళి ఆరోగ్యం కోసం ప్రపంచానికి మనదేశం అందించిన గొప్ప కానుక యోగా సాధన అన్నారు.ఆధునిక జీవనశైలి మూలంగా పెరుగుతున్న రోగాలను అరికట్టేందుకు యోగాసనాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. వయస్సుతో తేడా లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు యోగా చేయాలన్నారు.యోగా వల్ల మానసిక ఉత్తేజం,శారీరక దారుఢ్యం వస్తుందన్నారు.యోగా చేయడం ద్వారా ఒంట్లో రోగనిరోధక శక్తి , ప్రాణవా యువు పెరుగుతుందన్నారు.రోజూ యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు.యోగా ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించవచ్చని పేర్కొన్నారు.అంతకుముందు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ సారథి , డాక్టర్ శరత్ చంద్ర , డాక్టర్ కరుణాకర్ రెడ్డి , డాక్టర్ పద్మావతి, డాక్టర్ వీణా, శివసాయి పిరమిడ్ రమాదేవి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వర్ణ , పీవై ఫౌండేషన్ చైర్మన్ పడిదల ప్రసాద్ , నాగేశ్వరరావు గురూజీ, మధు గురూజీ, స్కూల్ ప్రిన్సిపాల్ పుండరీకాక్ష , ఫిజికల్ డైరెక్టర్ రహీమ్, వైద్యాధికారులు రామకృష్ణ , శ్రీనివాస్, శ్రీనివాసులు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.