రంగశాయిపేటలో రావణవధకు ఏర్పాట్లు పూర్తి

రంగశాయిపేటలో రావణవధకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 21 (జనం సాక్షి)రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణ వధ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అన్నారు.శనివారం రోజున రంగశాయిపేట లోని మహంకాళి గుడి మైదానంలో రావణ వధ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ సోమవారం విజయదశమి పండుగ రోజున సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు రావణవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు రంగశాయిపేట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో మా ఉత్సవ సమితి ప్రతినిధులు పూజలు నిర్వహించి ఊరేగింపుగా మహంకాళి దేవాలయ ఆవరణకు విచ్చేస్తారని తెలిపారు. సాయంత్రం 6:30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ రావణవధ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, విశిష్టఅతిథులుగా గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, గౌరవఅతిథులుగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, లోక్ సభ సభ్యులు పసునూరి దయాకర్, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ప్రత్యేకఅతిధులుగా జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్, సుప్రభ హోటల్ ఎండి గుండు ప్రభాకర్, సీనియర్ పాత్రికేయులు శెంకేషి శంకర్ రావు, నూర శ్రీనివాస్, ఆత్మీయఅతిథులుగా 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ , 40వ డివిజన్ కార్పొరేటర్ రవి, 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్, 44వ డివిజన్ కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ గార్లు విచ్చేస్తారని గుండు పూర్ణచందర్ తెలిపారు.ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి దామెరకొండ కరుణాకర్ మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో రంగశాయిపేటలోని కొంతమంది పెద్దలు ప్రారంభించిన ఈ రావణవధ కార్యక్రమాన్ని 2002 సంవత్సరం నుండి మా కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెద్దలందరి ఆశీస్సులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ తమ సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. కావున సోమవారం విజయదశమి రోజున నిర్వహించే ఈ రావణవధ కార్యక్రమానికి రంగశాయిపేట, శంభునిపేట ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్, ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్, కోశాధికారి కొక్కొండ భాస్కర్, ముఖ్య సలహాదారులు ముత్తినేని రామమూర్తి, మండల లక్ష్మయ్య, డాక్టర్ పోతు దర్శనం, నాయిని అశోక్, బివి రామకృష్ణప్రసాద్, చిమ్మని చంద్రమౌళి, మడుపోజు రామ్మూర్తి, ఉపాధ్యక్షులు పరికిపండ్ల రాజేశ్వర్ రావు, వలుపదాసు రాజశేఖర్, కోట శ్రీధర్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి పాకాల మనోహర్, కార్యదర్శులు కంచ రమేష్, బజ్జురి వీరేశం, పస్తం బిక్షపతి, వంగరి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎలుగు అశోక్, గుండు నవీన్ కుమార్, కత్తెరపల్లి వేణు, ఆడెపు రఘు, దేవునూరి వెంకటేశ్వర్లు, అల్లం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.