రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ నిమర్యాదపూర్వకంగా కలిసిన చంపాపేట కాలనీవాసులు

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో వున్న రీజిస్ట్రేషన్ మరియు యూ.ఎల్.సీ సమస్యలు  ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  కృషి వల్ల పరిష్కారం అయింది.అట్టి జీ.ఓ.వివరాలు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్,పురపాలక,ఐటి,పరిశ్రమల శాఖ మంత్రివర్యలు.కేటీఆర్  రెండు రోజుల క్రితం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ మరియు యూ.ఎల్.సీ సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టు జీ.ఓ.కాపీని విడుదల చేశారు.దానిలో భాగంగా  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  ఆధ్వర్యంలో శనివారము   రంగారెడ్డి జిల్లా కలెక్టర్    అమోయ్ కుమార్ ని చంపాపేట కాలనీవాసులచే కలిసి వారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ ఇట్టి రిజిస్ట్రేషన్ యూ.ఎల్.సీ.సమస్యల పరిష్కారం కోసం మాకు అణువు,అణువునా సహకరించిన కలెక్టర్ కి రెవెన్యూ అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి జీ.ఓ.వల్ల పేద,మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది అని తెలిపారు.లబ్ది పొందిన కాలనీవాసులు జీవితాంతం రుణపడి ఉంటారు అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో చంపాపేట డివిజన్ సీనియర్ నాయకులు నల్ల.రఘుమరెడ్డి,డివిజన్ అధ్యక్షులు రాజిరెడ్డి,మహిళా అధ్యక్షురాలు రోజారెడ్డి,కాలనీ వాసులు చంద్రమోహన్ రెడ్డి,చంద్రమౌళి,దుర్గారెడ్డి,అంజిరెడ్డి,సాయిరాం,సత్తయ్య,జనార్దన్ రెడ్డి,నర్సిరెడ్డి,వసంత,ప్రకాష్ రెడ్డి,మదన్ మోహన్ రెడ్డి,బలరాం రెడ్డి,వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.