రక్తదానం ఒక సామాజిక బాధ్యత: పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహజన్ ఐపిఎస్

పెద్దపల్లి బ్యూరో(జనం సాక్షి)జూలై30: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పోలీసులు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంబింఛి డీసీపీ రక్తదానం చేశారు. అనంతరం ఇంచార్జ్ డీసీపీ మాట్లాడుతూ….. రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, క్లిష్ట పరిస్థితులల్లో, ఉన్నప్పుడూ ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని రక్త దానము చేయడములో అపోహలు ఉండకూడదు అనీ, తీవ్రమైన వ్యాదుల నుండి గాని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సరియిన రక్తము లభించక ఎంతో మంది మరణించడము జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమవంతు సహాయము చేస్తున్నవిషయములో చాలా సంతోషము అనీ, తలసేమియా, సికిల్‌సెల్‌, ఎనీమియా వ్యాధిగ్రస్తులకు, అత్యవసర రోగులకు రక్తం లభించడం లేదన్నారు. ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందరిని కొనియాడారు. ప్రతి పోలిస్ సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, యువకులు పాల్గొని, 386 యూనిట్ల రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చెసిన వారీకి ప్రశంస పత్ర లను డిసిపి అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీలు సారంగపాణి, గిరి ప్రసాద్, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సతీష్, ఎస్సైలు మహేందర్, రవీందర్, మౌనిక, సహదేవ్ సింగ్, శివాని, లక్ష్మణ్, రాజ వర్ధన్, ఉపేందర్, వెంకటకృష్ణ, రవి ప్రసాద్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.