రక్తదానం ప్రాణదానంతో సమానం

మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- వజ్రోత్సవాలలో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని  మున్సిపల్ చెర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు ఎంపిపి కృపేష్ తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. అనేక అత్యవసర పరిస్థితులలో దాతలిచ్చిన రక్తం ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు.  రక్తదాన ఆవశ్యకతను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో రక్తదానానికి ఒక రోజు కేటాయించడం చాలా సంతోషమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వజ్రోత్సవంలో భాగంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గానికి 75 మంది రక్తదాతలతో రక్తదాన శిబిరంలో పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నేడు రక్త దానశిబిరం లో పాల్గొన్న ప్రతి ఒక్క యువకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రక్త దానం చేసిన యువకులకు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ నాగజ్యోతి, ఇబ్రహీంపట్నం మంచాల ఎంపీడీఓ లు పీహెచ్సీ వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు