రఘునాథ పాలెం ఆగష్టు 28(జనం సాక్షి)

బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ కు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా లింగాల రవికుమార్ చేపట్టిన సామాజిక సేవ చైతన్య కార్యక్రమాలు అభినందనీయమని అంబేద్కర్ ఆశయాల సాధన కోసం లింగాల అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఆయన కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం 25 ఏళ్ల సామాజిక ప్రజాప్రస్థానం అంబేద్కర్ మమెంటో ను అందజేశారు లింగాల రవికుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చైతన్య యాత్ర అంబేద్కర్ చైతన్య బాట దళిత చైతన్య సదస్సులు అంబేద్కర్ చైతన్య భేరి ప్రజా చైతన్య బేరి యువభేరి కార్యక్రమాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర పేద వర్గాలను చైతన్య పరుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని అంబేద్కర్ మహనీయుల జయంతి వర్ధంతి సభలు పలు ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు ద్వారా మహనీయుల స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించామని వివరించారు వివిధ పాఠశాలలు కళాశాలలోవిద్యార్థులకు వ్యాసరచన పోటీలు సెమినార్లు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేసి విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించడం జరిగిందని తెలిపారు అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు చలివేంద్రాలు పేదలకు వృద్ధులకు వస్త్రాలు ఆస్పత్రులలో పండ్లు పంపిణీ అన్నదానం నిర్వహించామని లాక్ డౌన్ లో మాస్కులు శానిటైజర్లు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు పలు ప్రాంతాలలో అంబేద్కర్ ప్రజా చైతన్య బాట నిర్వహిస్తున్నామని అయన తెలియజేశారు