రచ్చపల్లి గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీ

జనంసాక్షి, మంథని : తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ యాదవ కులస్థుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం పశు సంవర్దక శాఖ ద్వారా పెద్దపల్లి జిల్లాలో ప్రతి మండలంలో వివిధ గ్రామాల ప్రాధాన్యత క్రమంను అనుసరించి గొల్ల కురుమ లబ్ద్దిదారులకు అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.
మంథని మండలం రచ్చపల్లి గ్రామములో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం లక్ష్యం – 33 కాగా
శుక్రవారం 24 యూనిట్లు ఇతర రాష్ట్రాల నుండి సరఫరా చేయడం జరిగింది. మిగిలిన లబ్దిదారులకు కూడ త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని అన మండల పశు వైద్యాధికారి డాక్టర్.అనిల్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనవేన శ్రీనివాస్, గొర్రెల పెంపక సహకార సంఘ అద్యక్షుడు జాగిరి అజయ్, గుంజపడుగు పశు వైద్యాధికారి డాక్టర్.రవి, పశు వైద్య సిబ్బంది మన్నన్, అజయ్, సింగనవేన అశోక్.కోడారి రాజయ్య.రాజు.కనవేన కొమురయ్య.సది.మల్లేష్. తిప్పన వేన కుమార్.గొర్రెల యూనిట్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.